Six-year-old-boy-beheaded-in-front-of-his-mother-in-Saudi-Arabia

సౌదీలో కన్నతల్లి ముందే ఆరేళ్ల బాబు తల నరికేశాడు..

కన్నతల్లి ముందే బిడ్డ తల నరికాడు


సౌదీలో ఓ టాక్సీ డ్రైవర్‌ ఘాతుకం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: తన ఆరేళ్ల కొడుకు జకారియాతో తల్లి ఓ టాక్సీలో మహ్మద్‌ ప్రవక్త పవిత్ర క్షేత్రం మదీనాకు బయలుదేరింది. ఉన్నట్టుండి ఓ కాఫీ షాపు వద్ద డ్రైవర్‌ టాక్సీని ఆపాడు. బాలుడిని కారులోంచి బలవంతంగా బయటకు లాగా డు. ఓ పదునైన గాజు ముక్కతో బాలుడిపై దాడి చేయగా, ఆ బాలుడి తల ఎగిరి పడింది. తన కళ్లెదుటే జరిగిన ఈ ఘటనతో ఆ తల్లి పెద్ద పెట్టున కేకలు వేస్తూ కుప్పకూలిపోయింది. అంతకుముందు దాడి నుంచి కుమారుడిని కాపాడుకునేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. సౌదీలోని మదీనాలో శుక్రవారం పట్టపగలు అందరూ చూస్తుండగా ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు.. ఉన్మాది నుంచి బాలుడిని కాపాడేందుకు వచ్చేలోపే ఈ ఘోరం జరిగిపోయింది. కాగా టాక్సీ డ్రైవర్‌ మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. మదీనాకు బయలుదేరే ముందు ట్యాక్సీలో కూర్చున తన వద్దకు వచ్చి మీరు షియాలా అని అడిగినట్లు మృతుడి తల్లి చెప్పింది. దీంతో ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.