Sheikh-Hamdan-surprises-expat

ఆశ్చర్యపరిచిన దుబాయ్ క్రౌన్‌ప్రిన్స్

దుబాయ్: యూఏఈలోని సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్‌గా మారిన ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్‌దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూం ఓ సాధారణ వ్యక్తిలా వ్యవహరించడమే వీడియో వైరల్‌గా మారడానికి కారణమైంది. దుబాయ్‌లో తన అనుచరులతో ఓ బోటులో రైడ్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచిన  హమ్‌‌దాన్.. వలసజీవి బోటు కెప్టెన్‌తో ఆయన సాధారణ వ్యక్తిలా మాట్లాడారు. అంతేకాకుండా తన ఇన్‌స్టాగ్రాం పేజీ లైవ్ ద్వారా ఆశ్చర్యపరిచారు. కెప్టెన్ పేరు, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ‘‘ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అంటూ తన మంచితనాన్ని ప్రదర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో క్రౌన్‌ప్రిన్స్ ప్రవర్తనపట్ల నెటీజన్లు ఆశ్చర్యపోతున్నారు.