severe-infection-

స్పైడర్ కుట్టడంతో.. ఇన్‌ఫెక్షన్ సోకి..

వాషింగ్టన్: మనుషులకు స్పైడర్‌లతోనూ ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే అన్ని రకాల స్పైడర్లతో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదని వారు స్పష్టం చేశారు. కొన్నింటిలో మాత్రమే మనుషులకు ప్రమాదం కలిగించే అంశాలున్నాయని వారు తెలిపారు. ఇటీవల సోమర్ ఫీల్డ్(55) అనే వ్యక్తికి స్పైడర్ కాటు వేయడంతో అరుదైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ సోకిందని డాక్టర్లు చెప్పారు.

ఫీల్డ్ తన తోటలో పని చేస్తుండగా స్పైడర్ కుట్టిందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే స్పైడర్ కాటు వల్ల ఏమి ప్రమాదం ఉండకపోవచ్చని ఫీల్డ్ భావించాడని వారు చెప్పారు. అయితే కొద్దిరోజుల తర్వాత స్పైడర్ కుట్టిన చోట పుండ్లు ఏర్పడటం మొదలైందన్నారు.

అయితే ఏన్ని మందులు వాడినా ఆ పుండ్లు తగ్గలేదన్నారు. దాంతో కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రిలో చేర్పించారని వారు తెలిపారు. తాము పరీక్షలు జరిపిన తర్వాత స్పైడర్‌ ద్వారా ఇన్‌ఫెక్షన్ సోకిందని తేల్చామని డాక్టర్లు చెప్పారు. దాదాపు రెండు వారాలపాటు చికిత్స అందించిన తర్వాత కొంతవరకు కాలు మెరుగైందన్నారు. నాలుగు వారాల తర్వాత ఫీల్డ్ లేచి నడవగలిగారని డాక్టర్లు తెలిపారు.