Saudi-women-attend-football-game-for-first-time

సౌదీలో అరేబియాలో మొదటిసారిగా జరిగిందిదీ

రియాద్: గల్ఫ్ దేశం సౌదీఅరేబియాలో మొదటిసారిగా ఆసక్తికరమైన ఓ దృశ్యం ఆవిష్కృతమైంది. సౌదీ మహిళలు మొదటిసారిగా క్రీడా మైదానంలోకి అడుగుపెట్టి ఆటను ప్రత్యక్షంగా వీక్షించారు. ఎంతో ఆనందంగా మ్యాచ్‌కు హాజరయ్యారు. మహిళలు క్రీడా మైదానాల్లోకి ప్రవేశించకూడదనే నిబంధనను అక్కడి ప్రభుత్వం ఎత్తివేయడంతో మొదటిసారిగా ఈ ఘటన జరిగింది. జెడ్డా నగరంలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ చరిత్రాత్మకమైన ఈ ఘటనకు వేదికైంది. ఇదిలావుండగా సౌదీ రాజు సాల్మాన్ ఆదేశాల మేరకు గతేడాది కీలకమైన సంస్కరణలు జరిగాయి. మహిళలకు కార్లు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా సినిమా హాళ్లకు కూడా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.