saudi-to-establish-worlds-largest-solar-power-plant

ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్..ఎక్కడో తెలిస్తే..

రియాద్: ప్రపంచంలో ఆయిల్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం సౌదీఅరేబియా.. తన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అందుబాటులో ఉన్న ప్రత్యమ్నాయాలను అన్వేషిస్తోంది. ఈ మేరకు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాజధాని నగరం రియాద్‌కు సమీపంలో ఈ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేసింది. పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సోలార్ ప్యానళ్లను ప్రభుత్వ ల్యాబ్‌లో పరిశోధకులు పరిశీలిస్తున్నారు. ఆయిల్‌ ద్వారా అధిక ఆదాయం పొందాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సౌదీ అధికారులు చెపుతున్నారు.