Saudi-police-arrest-men-after-celebratory-wedding-gunfire

సౌదీ సోషల్ మీడియాలో వీడియో వైరల్..ఇద్దరి అరెస్ట్

రియాద్: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోని చూసిన సౌదీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వీడియోలో జనసందోహం మధ్య గాల్లోకి తుపాకీతో కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సౌదీలో సందడిగా ఓ జంట పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించిన వేడుకల్లో భాగంగా నృత్యం చేస్తూ ఇద్దరు వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ వారిని గుర్తించలేకపోయారు. అనంతరం కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నిందితులిద్దరినీ పోలీసులు గుర్తించారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నామని అస్సిర్ పోలీసుల్ డిపార్ట్‌మెంట్ అధికారి జైద్ మహమ్మద్ అల్ దబ్బాస్ తెలిపారు. నిందితుల వద్ద తుపాకీలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సౌదీ పౌరులు తమ అభిప్రాయాలను వెలువరిస్తున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా తుపాకీలను పేల్చడాన్ని నిషేధించడం మంచిదని సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ సంస్కృతి సౌదీ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తొలగించాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.