Saudi-nurse-fired-for-indecent-gesture-on-social-media

సోషల్ మీడియాలో వీడియో..నర్సు ఉద్యోగానికి ఎసరు

రియాద్: కొంతమంది తాము ఏ పనిచేస్తున్నా సెల్‌ఫోన్‌తో చిత్రీకరించడం లేదా ఫోటోలు తీసుకోవడం చేస్తుంటారు. అనంతరం వాటిని సోషల్ మీడియా మధ్యమాల ద్వారా తమ సన్నిహితులు, మిత్రులకు పంపిస్తుంటారు. అలా పంపించడం వల్ల అనర్థాలు జరుగుతాయని ఊహించరు. ఇదేకోవకు చెందిన నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ విధుల్లో ఉన్న సమయంలో ఓ వీడియోని చిత్రీకరించి సన్నిహితులకు పంపించింది. ఈ వీడియోనే ఆమె ఉద్యోగానికి ఎసరు పట్టేలా ఉంది. సౌదీలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

నర్సుగా పని చేస్తున్న ఓ మహిళ సెల్‌ఫోన్‌‌తో ఓ వీడియోని చిత్రీకరించింది. వీడియోలో అసభ్యకరమైన కొన్ని సంజ్ఞలు చేసింది. అంతటితో ఆగకుండా ఆవేశంగా పచ్చిపిచ్చిగా మాట్లాడింది. ఈ వీడియోని తన సన్నిహితులకు పంపించింది. ఎవరో ఓ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మహిళ చేసిన సంజ్ఞలు అసభ్యకరమైనవిగా ఉండడంతో తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. ఈ విషయం ఉన్నాతాధికారులకు కూడా తెలిసింది. సౌదీలోని చట్టాల ప్రకారం ఉద్యోగాన్ని నిర్వహిస్తున్న వ్యక్తులు హుందాగా, బాధ్యయుతంగా ప్రవర్తించాలి. అనుచిత ప్రవర్తనకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. వీడియోలో మహిళ ప్రవర్తన అసభ్యకరంగా ఉండడంతో విచారణ జరపనున్నారు. అనంతరం చర్య తీసుకొన్నున్నారు. ఇదిలావుండగా నర్సు ఉద్యోగం ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పు చేసిన నర్సుకు తగిన శిక్షే పడాలని, తప్పేమీ లేదని ఎవరో తెలియని వ్యక్తులు ఈ వీడియోని పోస్టు చేశారు కాబట్టి శిక్ష విధించాల్సిన అవసరం లేదని పలువురు నెటీజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.