Saudi-Govt-sensational-decision

సౌదీసర్కారు సంచలన నిర్ణయం

రియాద్, 14-09-2018: సౌదీసర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ దేశంలోనే మొట్టమొదటిసారి ఓ సౌదీ మహిళను విమాన కో పైలెట్ గా నియమిస్తూ సౌదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. సౌదీ సర్కారు అనుమతించడంతో రియాద్ కేంద్రంగా నడుస్తున్న ఫ్లైనాస్ విమానయాన సంస్థలో సౌదీ మహిళను కో పైలెట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్లైనాస్ విమానయాన సంస్థ మహిళా కోపైలెట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా వెయ్యిమంది సౌదీ మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. విమానయాన సంస్థల్లో మహిళలు పనిచేసేందుకు సౌదీ సర్కారు గతంలో అనుమతించలేదు. ఫిలిఫ్పీన్స్ తో పాటు పలు విదేశాల్లో విమానయాన రంగంలో మహిళలు పనిచేస్తున్న నేపథ్యంలో సౌదీ సర్కారు మహిళలను కోపైలెట్లుగా నియమించేందుకు ఎట్టకేలకు అనుమతించింది. దీంతోపాటు సౌదీలో మహిళలు కార్ల డ్రైవింగ్ పై ఉన్న నిషేధాన్ని సైతం సౌదీ రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ జూన్ నెలలో ఎత్తివేశారు.