saudi-airlines-stated-their-office-in-india

సౌదీ ఎయిర్‌లైన్స్ కార్యాలయం.. భారత్‌లో కూడా..

రియాద్: భారత రాజధాని న్యూఢిల్లీలో సౌదీ ఎయిర్‌లైన్స్ తమ కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత్‌లో ఉండే సౌదీ రాయబారి మహ్మద్ అల్ సతి చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిగిందని సౌదీ మీడియా తెలిపింది. అయితే సౌదీకి, భారత్‌కు మధ్య ఎన్నో ఏళ్ల నుంచి మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా మహ్మద్ అల్ సతి గుర్తుచేసుకున్నారు. ఎంతో మంది భారత కార్మికులు సౌదీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. సౌదీ వెళ్లే భారత వలస కార్మికుల సౌకర్యార్థమే తమ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించామని మహ్మద్ అన్నారు.