:: Welcome to NRI - Article ::

ఒక నెల ఆడ శిశువుపై సౌదీ తండ్రి అరాచకపర్వం

రియాద్: సౌదీఅరేబియాకు చెందిన ఓ వ్యక్తి అడవిలోని మృగాల కంటే దారుణంగా ప్రవర్తించాడు. ఒక నెల వయసున్న తన కూతురిపై రాక్షసుడిలా  పైశాచికత్వాన్ని చూపించాడు. ఏమాత్రం కనికరం లేకుండా... చంటిబిడ్డను ఇష్టమొచ్చిన కొడుతూ, గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడు. భర్త కొనసాగిస్తున్న ఈ అరాచకత్వాన్ని భార్య సెల్‌ఫోన్లో చిత్రీకరించింది. ‘‘ నా భర్త పెడుతున్న హింస నుంచి నా కూతురిని రక్షించమని ప్రతి అధికారిని, లాయర్‌ని నేను కోరుతున్నాను’’ అని ట్విట్టర్‌లో వీడియోని పోస్ట్ చేసింది. తాను ఇరాన్‌కు చెందిన మహిళనని, భర్త సౌదీకి చెందిన వ్యక్తని కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నామని, ఈ కారణంతో తమను హింసిస్తున్నాడని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించింది. దీంతో ఈ వీడియో సౌదీలో ప్రకంపనలు రేపింది. ఈ వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కార్మిక, సామాజిక అభివృద్ధి శాఖా మంత్రి ఖలీద్ అబూ అల్ ఖైల్ స్పందించారు. బాధిత మహిళ నుంచి పూర్తీ సమాచారాన్ని సేకరించారు. చర్యలు తీసుకుంటామని మహిళకు తెలియజేశారు. ఈ ఘటనపై నెటీజన్లు తీవ్రఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

మానవరూపంలో ఉండి మృగంలా ఏలా ప్రవర్తించాడో చూడాలనుకుంటే క్లిక్ చేయండి

 

Loading...