Sankranti-in-Canada

‘-30’ డిగ్రీల చలిలో సంక్రాంతి సంబరాలు!

కెనడా:భోగిపళ్లు, రంగు రంగుల ముగ్గులతో కోలాహలంగా ఉండే సంక్రాంతిని ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలుగు వారు జరుపుకుంటారు. దీన్ని మరోసారి రుజువు చేశారు కెనడాలోని తెలుగువారు. ‘-30’ డిగ్రీల చలిని కూడా లెక్కచేయకుండా అంగరంగ వైభోగంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో చింగస్కీ సెకండరీ స్కూల్, భ్రాంప్టెన్‌లో ఈ సంబరాలు జరుపుకొన్నారు.  తెలుగు వారందరినీ తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల ఆహ్వానించగా, కల్పనా మోటూరి, రజని లయం, ముంతాజ్ బేగం, సుష్మ అర్చన దీప ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమానికి వచ్చిన చిన్నపిల్లలకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి పర్వదినంపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. తాకా అధ్యక్షుడు అరుణ్ లయం తెలుగు వారినుద్దేశించి ప్రసంగించారు.  తాకా మాజీ అధ్యక్షుడు చారి సామంతపూడి, గంగాధర్ సుఖవాసి నూతన సంవత్సర కేలండర్‌ ఆవిష్కరించారు. ఆరుగంటల పాటు న‌ృత్యాలు, ఆటపాటలతో ఎంతో కోలాహలంగా వేడుకలు చేసుకున్నారు. అనంతరం అచ్చ తెలుగు వంటకాలతో భోజనాలు పెట్టారు. చివరగా జాతీయ గీతంతో సంక్రాంతి సంబరాలను ముగించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కమిటీ అధ్యక్షుడు సురేష్ కూన, సాంస్కృతిక కమిటీ అధ్యక్షురాలు దీపా సాయిరాం, వాణీ జయంత్, కేలండర్ కమిటీ ఉపాధ్యక్షులు దుగ్గిన రామచంద్రరావు, కోశాధికారి కల్పనా మోటూరి, రిజిస్ట్రేషన్ కమిటీ సభ్యుడు రాఘవ్ అల్లం, ఇతర సభ్యులు పాల్గొన్నారు.