Sankranti-Celebrations-in-Atlanta-

అట్లాంటాలో 'తామా' ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

అట్లాంటా తెలుగు సంఘం 'తామా' ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నార్క్రాస్ ఉన్నత పాఠశాల ఈ సంబరాలకు వేదికైంది. మొత్తం 1200 మంది తెలుగు ప్రజలు సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సంబరాలను విజయవంతం చేయడంలో శూరా ఈబి 5 ఫండ్, మై టాక్స్ ఫైలర్, సంక్రాంతి రెస్టారెంట్‌ యాజమాన్యాలు సాయం అందించాయి. కార్యక్రమంలో భాగంగా పిల్లల కోసం ప్రత్యేకంగా గ్లోబల్ ఆర్ట్ కళ, ది యంగ్ లీడర్స్ అకాడమీ ఉపన్యాసం పోటీలు నిర్వహించారు. మహిళల కోసం ముగ్గుల పోటీలు, మెహందీ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యదర్శి సుబ్బారావు మద్దాళి స్వాగతోపన్యాసం చేశారు. తామా కార్యవర్గం, బోర్డు సభ్యులు కలిసి జ్యోతి ప్రజ్వలన కావించారు. తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ప్రదర్శించిన జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సినీ పాటలు, నృత్యాలు,  శ్లోకాలు అందరిని ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలు కూడా అందజేశారు.

 
అధ్యక్షులు వెంకీ గద్దె మాట్లాడుతూ తామా నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడేలా ఉన్నాయన్నారు. తామా కార్యవర్గ చైర్మెన్ వినయ్ మద్దినేని సారధ్యంలో బోర్డు సభ్యుల చేతులమీదుగా స్పాన్సర్స్ శ్రీనివాస్ నిమ్మగడ్డ, హరిప్రసాద్ సాలియాన్, జాన్స్ క్రీక్ డిస్ట్రిక్ట్ 50 హౌస్ రిప్రజంటేటివ్ ఏంజెలికా కౌషె, హిందూ టెంపుల్ ప్రెసిడెంట్ షీలా లింగం, అట్లాంటా ఐటీ సర్వ్ ప్రెసిడెంట్ క్రిస్ గద్దె, స్కాలర్షిప్స్ సమన్వయకర్త సీత వల్లూరుపల్లి, మనబడి సమన్వయకర్త విజయ్ రావిళ్లలు కలిసి ఉపాధ్యాయులను సత్కరించారు. 
 
అలాగే గాయని శిల్ప, గాయకులు ప్రసాద్ సింహాద్రి తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. గాయని శిల్ప నిర్వహించిన సంప్రదాయ దుస్తుల పోటీలలో మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. 
 
చివరిగా కార్యక్రమం విజయవంతమయ్యేందుకు సహకరించిన వాలంటీర్స్ శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి, ఉపేంద్ర నర్రా, వెంకట్ అడుసుమిల్లి, విజయ్ రావిళ్ల, శ్రీని బలుసు, వెంకట్ గోగినేని, విజయ్ కొత్తపల్లి, మురళి బొడ్డు, విజయ్ బాబు కొత్త, యశ్వంత్ జొన్నలగడ్డ, రమణ, చైతన్య, అరుణ మద్దాళి, సునీత పొట్నూరు, అబ్దు, రీమ, సాన్వి, అక్షు, వేదికను అందంగా అలంకరించిన మేరీగోల్డ్ ఈవెంట్స్ సుజాత పొన్నాడ, ఆడియో లైటింగ్ ఫోటోగ్రఫీ అందించిన బైట్ గ్రాఫ్ ప్రశాంత్ కొల్లిపర, భోజనాలు సరఫరా చేసిన సంక్రాంతి రెస్టారంట్ యజమాని శ్రీనివాస్ నిమ్మగడ్డ, సమర్పకులు శూరా ఈబి 5 ఫండ్ ప్రసాద్ గద్దె, మై టాక్స్ ఫైలర్ హరిప్రసాద్ సాలియాన్, నార్క్రాస్ ఉన్నత పాఠశాల యాజమాన్యం, వ్యాఖ్యాత శ్రీధర్, ది యంగ్ లీడర్స్ అకాడమీ కమల వడ్లమూడి, గ్లోబల్ ఆర్ట్ సుధ గోపాలకృష్ణన్, తామా కార్యవర్గ, బోర్డు సభ్యులకు వెంకీ గద్దె కృతజ్ఞతలు తెలియజేశారు.