Robot-waitress

రెస్టారెంట్‌లో పని చేస్తున్న రోబో వెయిటర్..

దుబాయ్: మనుషులు చేసే పని రోబోలు కూడా చేయగలవు. అందువల్ల రాబోయే తరాలు తప్పకుండా రోబోలపై ఆధారపడాల్సి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో రోబోలు కొన్ని కీలకమైన పనులు చేస్తున్నాయని వారు అంటున్నారు. ఇదిలావుండగా దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న రోబో వెయిటర్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బుర్ దుబాయ్‌లోని డ్రింక్స్ అండ్ స్పైస్ మ్యాజిక్ అనే రెస్టారెంట్‌లో రోబో వెయిటర్ పనిచేస్తోంది.

రోబో వెయిటర్‌ను చూసేందుకు కస్టమర్లు కూడా ఆసక్తి చూపుతున్నారని రెస్టారెంట్ యజమాని చెబుతున్నారు. రోబో కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ను ఏర్పాటు చేశామని అతడు తెలిపాడు. అందువల్ల ఏ టేబుల్ వద్ద ఏయే పదార్థాలు సర్వ్ చేయాలో తెలుసుకుని రోబో వాటిని కస్టమర్లకు అందిస్తోందన్నాడు. అలాగే పుట్టిన రోజు వేడుకల వంటి కార్యక్రమాలకు రోబో ప్రత్యేకంగా సంగీతం కూడా వినిపిస్తుందని అతడు తెలిపాడు.