:: Welcome to NRI - Article ::

దుబాయిలో ఎక్కువగా యాక్సిడెంట్స్ చేస్తోంది వీళ్లేనట

యూఏఈ: కఠిన చట్టాలు చేసిన రోడ్డు భద్రతా నియమాలను పాటించేవారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోందని దుబాయి పోలీసులు వాపోతున్నారు. భారీ మొత్తంలో జరిమానాలు, జైలు శిక్షలను ప్రకటించినా వాటిని పాటించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ యేడాది ఇప్పటివరకూ మొత్తం 169 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. గతేడాది ఇదే కాలపరిమితిలో 137 యాక్సిడెంట్లు జరిగాయని పోలీసు అధికారులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు చేయడంలో మొదటి స్థానంలో యూఏఈ పౌరులు ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో భారతీయులు, పాకిస్తాన్, ఈజిప్టు దేశస్థులు ఉన్నారు. విదేశాల నుంచి వలస వచ్చిన వారిలో ప్రమాదాలు ఎక్కువగా చేస్తున్నది భారతీయులేనట.  ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా సడన్‌గా వాహనాన్ని పక్కకు తీసుకెళ్లడం, అతివేగం వంటి కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయేవారు ఎక్కువన్నారు. 

 

Loading...