Ring-bought-at-boot-sale

33 ఏళ్ల క్రితం కొన్న రింగ్.. ప్రస్తుతం ధర కోట్లు పలికి..

లండన్: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అప్పుడప్పుడు ఇంట్లో ఉండే పాత వస్తువులు కూడా మన అవసరాలకు అక్కరకొస్తుంటాయి. అలాంటి సంఘటనే లండన్‌లో జరిగింది. బంధువులు మోసం చేయడంతో డేబ్రా(55) అనే మహిళ ఉన్న ఆస్తి మొత్తం కోల్పోయి, ప్రభుత్వం నిర్మించిన కార్పొరేషన్‌ ఇంట్లో నివసిస్తోంది. ఆమె తల్లి 33 యేళ్ల వయసులో ఓ రింగ్ కొనుక్కుంది. ఆ రింగ్ ప్రస్తుతం ఆమె పాలిట అదృష్టంగా మారింది. ఓ చోర్ బజార్‌లో ఆ రింగ్ 10 పౌండ్లు(రూ.917) ధర పలికింది. దాన్ని ఆమె కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చింది. కానీ, ఎప్పుడు వేలికి ధరించలేదు. ఆ రింగ్‌కు నీలం రంగులో ఓ రాయి అమర్చబడి ఉందని డేబ్రా చెప్పింది. అయితే ఈ మధ్య చేతిలో డబ్బు లేకపోవడంతో ఆ రింగ్ అమ్మేయాలని డేబ్రా ఓ నగల షాపు యజమాని దగ్గరకు వెళ్లింది. అతడు ఆ రింగ్‌కున్న రాయిని అదే పనిగా పరిశీలించాడు. అదో వజ్రమని అతడి నమ్మకం. రాత్రంతా దాన్ని పరీక్షించి చూశాడు. అది నిజంగా వజ్రమేనని డేబ్రాతో చెప్పాడు. కొన్ని కోట్లు విలువ చేస్తుందన్నాడు. వెంటనే డేబ్రా ఆ వజ్రాన్ని వేలం వేసింది. వేలంలో ఆ వజ్రం ధర 4,70,000(రూ.4,30,98,362) పలికింది.