Rain..-dust-clouds..winds-sweep-over

కాంతి ప్రసరణ తగ్గి.. పట్టపగలే చీకటి అలముకుంటుందని..

దుబాయ్: మారిపోతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా జాగ్రత్తలు పాటించాలని వాహనాదారులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పట్టపగలే దుళిమేఘాల వల్ల కాంతి ప్రసరణ వెయ్యి మీటర్ల వరకు తగ్గనుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. దాంతో చాలా ప్రాంతాల్లో చీకటి అముకునే అవకాశం ఉందని వారు తెలిపారు. మరో వైపు గంటకు 55కి.మీ.ల వేగంతో గాలులు వీస్తున్నాయన్నారు. ఈ గాలుల వల్ల ఎర్రసముద్రంలో వాయుగుండం ఏర్పడనుందన్నారు. ఈ వాయుగుండం తుఫాన్‌గా మారనుందన్నారు. ఈ రోజు ఉదయం దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కూడా కురిసింది.