:: Welcome to NRI - Article ::

‘టెస్లా’ను సందర్శించిన రాహుల్‌

వాషింగ్టన్‌, సెప్టెంబరు 13: అమెరికాలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాలిఫోర్నియాలో ఫెర్‌మాంట్‌లో ఉన్న టెస్లా కర్మాగారంతోపాటు సిలికాన్‌ సిటీలోని సన్‌ పవర్‌ రీసెర్చి కేంద్రాన్ని కూడా సందర్శించారు. సోలార్‌ ప్యానళ్లు, ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో టెస్లా దిగ్గజ సంస్థగా వెలుగొందుతోంది. సంప్రదాయేతర ఇంధన వినియోగంలో వస్తున్న మార్పులను రాహుల్‌ ఆయా సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నేత శ్యాం పిట్రోడా ఉన్నారు. కాలిఫోర్నియాలో పర్యటన ముగించుకున్న రాహుల్‌ బుధవారం లాస్‌ ఏంజిలిస్‌ బయలుదేరి వెళ్లారు.