Prasad-as-TANA-chairman

తానా చైర్మన్‌గా ప్రసాద్‌

 

అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) ఫౌండేషన్‌ చైర్మన్‌గా డాక్టర్‌ ప్రసాద్‌ నల్లూరి ఎన్నికయ్యారు. పశ్చిమగోదావరికి చెందిన ఆయన అమెరికాలో తెలుగు ప్రజలకు కొన్నేళ్లుగా సేవలందిస్తున్నారు. అక్కడే ఆస్పత్రి నడుపుతున్నారు. ఆల్‌ ఇండియా మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ ఇన్‌ యూఎస్‌ఏకు అధ్యక్షుడిగా పనిచేశారు.