police-warned-to-sports-lovers-

క్రీడాభిమానులకు పోలీసుల హెచ్చరిక..

దుబాయ్: షార్జా స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చే క్రీడాభిమానులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కర్రలు, బాటిళ్లు, క్యాన్స్‌తోపాటు పదునైన ఆయుధాలు, బాణాసంచా, లేజర్స్, ఫర్‌ఫ్యూమ్స్, ఎలక్ట్రిక్, రెగ్యులర్ సిగరెట్లు మొదలైనవి స్టేడియంలోకి తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ క్రీడలు జరుగుతుండగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చూసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అలాగే షార్జా స్టేడియం సెక్యూరిటీ కమిటీ కూడా అంతర్జాతీయ క్రీడలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరిందన్నారు. అందువల్ల క్రీడాభిమానులు తమకు సహకరించాలని పోలీసులు సూచించారు.