police-search-for-indian-woman-in-kuwait

భారతీయ మహిళ కోసం కువైట్ పోలీసులు వెతుకుతున్నారు

కువైట్ సిటీ: అత్యంత ఖరీదైన వాచ్‌ను దొంగిలించిందనే అనుమానంతో భారత్‌కు చెందిన ఓ మహిళ కోసం కువైట్ పోలీసులు గాలిస్తున్నారు. తమ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న భారతీయ మహిళే ఈ దొంగతనానికి పాల్పడిందని భావిస్తున్నామని, వాచ్ ఖరీదు 4 వేల కువైట్ దినార్స్(దాదాపు రూ.9.5 లక్షలు) అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వివరాలు పూర్తిగా తెలియని భారతీయ మహిళ కోసం గాలిస్తున్నామని, ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు. బయటకు వెళ్లిన తాను ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించానని కుటుంబ యజమాని తెలిపారు.