police-created-Guinness-record--

పోలీసులు గిన్నిస్ రికార్డు సృష్టించారు

దుబాయ్: మోటార్ బైక్ ఫెస్టివల్‌లో భాగంగా దుబాయ్ పోలీసులు రూపొందించిన అల్ టెరాన్ వెహికిల్ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా పోలీసు డిపార్ట్‌మెంట్‌ గిన్నిస్‌లో చోటు సంపాదించుకుందని కెప్టెన్ అబ్దుల్లా హతావి హర్షం వ్యక్తం చేశారు. ఆయన దుబాయ్ పోలీసు స్టంట్ టీమ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. అల్ టెరాన్ వెహికిల్‌పై 60కి.మీలు ప్రయాణించి ఆయన రికార్డు సృష్టించారు. దుబాయ్ మోటార్ బైక్ ఫెస్టివల్‌లో మొత్తం మూడు వందల బైక్‌లతో రేసర్లు పాల్గొన్నారని అబ్దుల్లా చెప్పారు. అందరిలోనూ తామే మొదటిస్థానం దక్కించుకున్నామని దాంతో పాటు గిన్నిస్ రికార్డు కూడా సృష్టించడం ఎంతో ఆనందంగా ఉందని అబ్దుల్లా చెప్పారు.