Please-helps-to-my-family-woman-seeks

నా భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయి

ఆర్థికంగా చితికిపోయాం... మా కుంటుంబాన్ని అధికారులే ఆదుకోవాలి 

మారిష్‌సలో మృతి చెందిన మదన్‌ భార్య వేడుకోలు 

కడప, క్రైం మే 15 : సొంత ఊరిలో ఆశించినంత జీతాలు లేకపోవడం డ్రైవర్‌, ఎలక్ర్టికల్‌ వృత్తిలో చాలీచాలని జీతాలతో కుటుంబ భారాన్ని మోయలేక బ్రతుకుదెరువుకోసం 9 నెలల క్రి తం మారిష్‌సకు వెళ్ళి అక్కడ అనుమానాస్పద స్థితిలో రెండు రోజుల క్రితం కడప పెద్ద బెస్త వీధికి చెందిన కసనబోయిన మదన్‌కుమార్‌ (40) మృతి చెందాడు. ఆ సమాచారాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలపడంతో భార్య రాజేశ్వరి, తల్లిదండ్రులు మస్తానయ్య, వెంకటసుబ్బమ్మలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తన భర్త మారిష్‌సలోని కంపెనీలో వేదింపులకు గురికావడంతో తాను ఇంటికి వస్తున్నట్లు చెప్పి ఇప్పుడు అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ కొందరు ఎయిర్‌పోర్టు వద్ద అనారోగ్యం తో మృతి చెందారంటూ మరి కొందరు పొంతనలేని సమాదానాలు చెబుతున్నారని తన కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని అధికారులే తమను అన్ని విధాలా ఆదుకొని తన భర్త మృతిపై విచారించాలంటూ మదన్‌ భార్య రాజేశ్వరి వేడుకుంటోంది. 
 
మదన్‌మోహన్‌ కడప నగరంలో కారు డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. ఆర్థికంగా చితికిపోవడంతో గల్ఫ్‌ దేశాలకు వెళ్ళి అక్కడ వచ్చే జీతాలతో తన భార్య, ఇద్దరు పిల్ల లు, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే ఉ ద్దేశంతో 9 నెలల క్రితం బద్వేలుకు చెందిన ర మణారెడ్డి, బాంబేకి చెందిన జయకుమార్‌ అనే ఏజెంట్ల ద్వారా మారిష్‌సలోని ప్రిన్సెసెస్‌ టూ నాలో ప్యాకింగ్‌ సెక్షన్‌ హెల్పర్‌గా వెల్లారు. కొన్ని నెలలు అక్కడ బాగా పని చేశాడు. గత కొంత కాలంగా కంపెనీ ఎక్కువ పనులు చేపించడంతోపాటు శారీరకంగా, మానసికంగా వేదిస్తున్నారంటూ భార్య రాజేశ్వరికి ఫోన్‌ ద్వారా తెలియజేస్తూ వస్తుండడంతో కుటుంబ సభ్యు లు స్వదేశానికి రావాలంటూ కోరడంతో త్వరలో తిరిగి ఇండియాకు వచ్చేందుకు సిద్ధమయ్యాడని భార్య పేర్కొంది. ఏమైందో ఏమో కాని తన భర్త మృతిపై స్పష్టత రావడంలేదని అధికారు లు స్పందించి నా భర్త మృతదేహం రప్పించాలని కలెక్టరేట్‌లోని అధికారులను మంగళవారం వేడుకున్నారు.