Please-help-to-Gulf-expats

గల్ఫ్‌ బాధితులను ఆదుకోండి

మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యేల వినతి

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన తెలంగాణ కార్మికులను ఆదుకోవాలని ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, గణేష్‌ బిగాల, శంకర్‌నాయక్‌, సుధీర్‌రెడ్డి, కాలే యాదయ్య మంగళవారం అసెంబ్లీ లాబీలో మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అక్కడి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఓ సమన్వయకర్తను నియమించాలని కోరారు. ఉపాధి కోసం గల్ఫ్‌కు వలసవెళ్లిన తెలంగాణ కార్మికులను అక్కడి కంపెనీల యాజమాన్యాలు, పాలకులు వేతనాలు ఇవ్వకుండా, పాస్‌పోర్టులను లాక్కొని నిర్బంధిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.