plastina-president-slams-america-ambassador-

అమెరికా దౌత్యవేత్తను బండబూతులు తిట్టిన పాలస్తీనా అధ్యక్షుడు

జెరూసెలం: ఇజ్రాయెల్‌కు అమెరికా రాయబారి అయిన డేవిడ్ ఫ్రైడ్‌మ్యాన్‌పై పాలస్తీనా అధ్యక్షుడు మహమౌద్ అబ్బాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనను ‘కుక్క కొడుకు’ (సన్ ఆఫ్ డాగ్) అంటూ బూతులు తిట్టారు. ఆయన మద్దతుతోనే ఇజ్రాయెల్ మద్దతుదారులు వెస్ట్‌బ్యాంక్‌ను ఆక్రమించారని ఆరోపించారు. పాలస్తీనా ముఖ్యనేత సమావేశంలో అబ్బాస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గతవారం గాజాలో పాలస్తీనా ప్రధానమంత్రి రమీ హమ్దల్లా కాన్వాయ్‌పై జరిగిన బాంబు దాడి వెనక హమాస్ హస్తం ఉందని ఆరోపించారు. అమెరికా రాయబారి డేవిడ్ ఫ్రైడ్‌మన్ అండతో ఇజ్రాయెల్ మద్దతుదారులు వెస్ట్‌బ్యాంకులో నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ కుక్క కొడుకు (సన్ ఆఫ్ డాగ్) అంటాడు కదా.. వారు తమ భూభాగంలోనే నిర్మాణాలు చేపడతున్నారని.. నిజానికి అతడో సెట్లర్, అతడి కుటుంబం కూడా ఆ కోవకు చెందినదే. టెల్ అవీవ్‌లో ఆయన యూఎస్ అంబాసిడర్. ఆయన నుంచి అంతకంటే మనం ఇంకేం ఆశించగలం?’’ అని అబ్బాస్ పేర్కొన్నారు.