picture-of-an-invisible-

అక్కడ ఓ కారు ఉందని ఎవ్వరూ గుర్తించలేక..

వాషింగ్టన్: మన కళ్లు అప్పుడప్పుడు మనల్ని మోసం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్టు చేసిన ఫోటోతో చాలా మంది మోసపోయారు. 'మా కళ్లు మమ్మల్ని మోసం చేశాయంటున్నారు'. ఈ పోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి తన కారును శుభ్రం చేశాడు. కారు తళతళ మెరిసిపోతోంది. అదే సమయంలో కారు ట్రాన్స్‌పారెంట్‌గా కనిపిస్తోంది. కారును జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప అక్కడ ఓ కారు ఉందన్న విషయం ఎవ్వరికీ తెలియడం లేదు. కారు పార్కింగ్ చేసిన చోట ఉన్న టాయల్స్ రంగులో కారు రంగు కూడా కలిసిపోయింది. దాంతో కారు పూర్తిగా గుర్తించలేని విధంగా మారిపోయింది.

అదే సమయంలో కారు యజమాని కారును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఫోటోలో ఏముందో గుర్తించాలని సవాల్ విసిరాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప అక్కడ ఓ కారు ఉందన్న విషయాన్ని చాలా మంది గుర్తించలేకపోయారు. కారు టైర్, డోర్ హ్యండెల్ మాత్రమే కనిపిస్తుండటంతో కొంతమంది దాన్ని గుర్తించారు.