:: Welcome to NRI - Article ::

యూఏఈలో పెరిగిన పెట్రోల్ ధరలు

అబూదబీ: పెట్రోల్ ధరలను పెంచుతూ యూఏఈ మినిస్ట్రీ ఎనర్జీ నిర్ణయం తీసుకుంది. నవంబర్ నెలకు గానూ పెరిగిన పెట్రోల్ ధరలతో కూడిన వివరాలను ఆదివారం ప్రకటించింది. గతంలో 1.81 దిర్హమ్స్‌గా ఉన్న సూపర్-98 ఇంధనం.. 1.90కు పెరిగింది. 1.70 దిర్హమ్స్‌గా ఉన్న స్పెషల్-95.. 1.79కు పెరిగింది. ప్లస్-91 చమురు ధర.. 1.63 నుంచి 1.72 దిర్హమ్స్‌కు పెరిగింది. దీంతోపాటు 1.76 దిర్హమ్స్‌గా ఉన్న డీజిల్ ధరను 15 పిల్స్ పెంచి 1.91 దిర్హమ్స్‌కు పెంచారు. పెరిగిన ధరలు నవంబర్ 1 నుంచి వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.