people-have-to-stay-indoors-

'ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావొద్దు'

న్యూయార్క్: 'ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప రోడ్ల పైకి రావొద్దు. ఇప్పటికే చాలాచోట్ల రోడ్లపై నడవలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాహనాలు కూడా మంచులో కూరుకుపోతున్నాయి.' అంటూ న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే న్యూయార్క్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోయాయన్నారు. అంతేకాదు రోడ్లపై మంచు 15 ఇంచుల మేర పేరుకుపోయిందని ఆయన చెబుతున్నారు. అత్యవసర సిబ్బంది ఎప్పటికప్పుడు మంచును తొలగించే కార్యక్రమం చేపడుతున్న భారీగా మంచు కురుస్తుండటంతో వారి ప్రయత్నాలు విఫలమవుతున్నాయన్నారు. బుధవారం నాటికి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. దాంతో పరిస్థితులు కొంతమేర చక్కబడతాయని ఆయన అన్నారు.