passport-will-work-as-address-proof

పాస్‌పోర్టుపై అడ్రస్‌ ఉండదు: విదేశాంగ శాఖ

పుణె, జనవరి 12: పాస్‌పోర్టు ఇకపై అడ్రస్‌ ప్రూఫ్‌గా పనికిరాకపోవచ్చు. ఎందుకంటే పాస్‌పోర్టు ఆఖరి పేజీలో చిరునామా వివరాలను పొందుపర్చకుండా ఖాళీగా వదిలేయాలని విదేశాంగ శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. తర్వాతి సిరీస్‌లో జారీ చేసే పాస్‌పోర్టులకు ఈ నిర్ణయం అమలు చేయనున్నట్టు ఎంఈఏ అధికారి సురేంద్ర కుమార్‌ తెలిపారు. పాతవాటిని గడువు ముగిసే వరకూ వాడుకోవచ్చని, రెన్యువల్‌ సమయంలో వాటికి కూడా మార్పులు వర్తిస్తాయని సురేంద్ర కుమార్‌ వెల్లడించారు.