Passport-problems-reduced

తొలగిన పాస్‌పోర్ట్‌ కష్టాలు

 

నల్లగొండలో పాస్‌పోర్ట్‌ కార్యాలయం
వారం కిందటే ప్రారంభం
ఇక హైదరాబాద్‌కు వెళ్లాల్సిన కష్టాలు తీరినట్టే..
నాలుగు రోజుల్లో ఇంటికి పాస్‌పోర్ట్‌..
ఇప్పటికే 300 దరఖాస్తులు

రామగిరి, నల్లగొండ, మార్చి 13: జిల్లా ప్రజలకు పాస్‌పోర్ట్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన బాధలు తప్పాయి. కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్‌ జారీని సరళీకృతం చేయడంలో భాగంగా మరిన్ని కేంద్రా లను అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో వారం రోజుల కిందట పాస్ట్‌పోర్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం తప్పినట్లే. కేంద్రం ఏర్పాటుతో దూరభారం తగ్గడంతో పాటు వ్యయ ప్రయాసలు తప్పాయి.  

పాస్‌పోర్టు పొందే ప్రక్రియ ఇది....
  • పాస్‌పోర్టు కోసం మొదటగా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పాస్‌పోర్ట్‌ఇండియా.జీఓవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసు కోవాలి. ఇందుకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఆపై ఆన్‌లైన్‌లో తేదీ, సమయం కేటాయిస్తూ నమోదువుతుంది. 
  • 10వ తరగతి విద్యార్హత ధ్రువీకరణ పత్రం,ఆధార్‌ కార్డ్‌లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. 
  • కేటాయించిన సమయానికి 30 నిమి షాల ముందే ధ్రువీకరణ పత్రాలు ఒరిజి నల్‌, జిరాక్స్‌ సెట్లతో పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుంది.
  • ఇక్కడికి అధికారులు ధ్రువీకరణ పత్రాలను విచారించి వేలి ముద్రలను తీసుకుంటారు. 
  • అనంతరం ఈ సమాచారం పోలీసు శాఖకు వెళ్తుంది. పోలీసులు కూడా సంబం ధిత దరఖాస్తుదారులకు తాము విచారణకు వస్తున్నామంటూ సమాచారం ఇస్తారు. 
  • ఆ తర్వాత విచారణ చేసి సదరు దరఖాస్తుదారుడి వివరాలు సరిగా ఉంటే ఓకే అని, ఏమైనా కేసులు గాని, మరే ఇతర పొరపాట్లుగాని చేసినట్లు వారి విచారణలో తేలితే ఆన్‌లైన్‌లో రిమార్కుగా నమోదు చేస్తారు. 
  • ఓకే అయిన దరఖాస్తుదారులకు మూడు నాలుగు రోజుల్లోనే స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పాస్‌పోర్ట్‌ ఇంటికి చేరుతుంది. 
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 90 రోజుల వరకు మాత్రమే గడువు ఉంటుంది. తర్వాత ఈ దరఖాస్తు ల్యాప్స్‌ అవుతుంది. 
  • ఉద్యోగస్తులు దరఖాస్తు చేసే సమ యంలో అనెగ్జర్‌లో దరఖాస్తు చేసుకున్నప్ప టికీ ఎన్‌ఓసీ సబ్‌మిట్‌ చేయటం ద్వారా పాస్‌పోర్ట్‌ పొందవచ్చు. 

గతంలో పరిస్థితి ఇలా...
గతంలో పాస్‌పోర్ట్‌ పొందాలంటే కనీసం నాలుగైదు నెలల సమయం పట్టేది. ధ్రువీక రణ పత్రాలను గెజిటెడ్‌ అధికారులతో ధ్రువీ కరణ చేయించి దరఖాస్తు చేసుకోవాల్సిన పరి స్థితి ఉండేది. అన్ని ధ్రువీకరణ పత్రాలు సమ ర్పించినా వాటిలో ఏదో ఒక చిన్న తప్పు జరి గితే కథ మళ్ళీ మొదటికి వచ్చేది.అన్ని డాక్యు మెంట్లు సబ్‌మిట్‌ చేసినప్పటికీ వచ్చిన సమాచారాన్ని నిర్ధారించుకోవటానికి నెలల కొద్దీ వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేది.తాజాగా విదేశాంగ శాఖ జారీ చేసిన ఆదేశా లతో నాలు గైదు రోజుల్లోనే ప్రస్తుతం ఇంటికి చేరుతుంది. 
 
విద్యార్హత లేకున్నా ఇలా పొందవచ్చు..
ఎలాంటి విద్యార్హతలు లేని వారు కూడా విదేశీయానం కోసం పాస్‌పోర్ట్‌ పొందవచ్చు. పుట్టిన తేదికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్న ఆధార్‌ కార్డుతో గాని, ఓటర్‌ ఐడీతో గాని, జనన నివేదిక ధ్రువీకరణ పత్రంతో గాని పాస్‌పోర్ట్‌ పొందవచ్చు. 

10 శాతం రాయితీ.. 
పాస్‌పోర్టు చట్టం ఏర్పాటై 50 ఏళ్ళు పూర్తైన సందర్భంగా 8 సంవత్సరాలలోపు చిన్నారులకు, 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకు దరఖాస్తు ఫీజులో 10శాతం తగ్గింపు ఉంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలో కూడా పాస్‌పోర్ట్‌ జారీ చేస్తారు. 
 
ఉమ్మడి జిల్లా ప్రజల హర్షం...
పాస్‌పోర్ట్‌ కార్యాలయాన్ని ప్రారంభించటంపై ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌కు వెళ్లే బాధలు తప్పాయని పేర్కొంటున్నారు. కాగా వారం రోజుల్లో 300మంది దరఖాస్తు చేసుకోగా, 200 మంది పాస్‌పోర్ట్‌ పొందారు.