Passengers-tension-flight-emergency-landing-

విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు..

కువైట్: కువైట్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఓ వ్యక్తి హఠాత్తుగా నిలబడి అర్థం కాని భాషలో ఏవో మాటలు మాట్లాడుతున్నాడు. సీట్ల మధ్యలో అటు ఇటు తిరుగుతున్నాడు. విమాన సిబ్బంది అతడిని తన సీట్లో కూర్చోమ్మని చెప్పారు. అయినా అతడు పట్టించుకోవడం లేదు. కొంతమంది అతడు తీవ్రవాది అయి ఉంటాడనుకున్నారు. విమానాన్ని హైజాక్ చేస్తాడేమోనని ఆందోళన చెందారు. అయితే పరిస్థితి గమనించిన పైలెట్ విమానాన్ని ఇరాన్‌లోని అల్ రే విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అప్పటికే విమాన సిబ్బంది ఆ వ్యక్తిని హ్యండ్ కఫ్స్ వేసి సీటుకు కట్టేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు.