:: Welcome to NRI - Article ::

‘అల్లుడు కాదు.. నాకు కొడుకు.. కట్నం వద్దే వద్దు’

మస్కట్: ఎవరిదైనా పెళ్లి జరుగుతోందంటే చాలు.. చుట్టుపక్కల వాళ్లు, స్నేహితులు, బంధువులు అడిగే మాటల్లో వరకట్నం ప్రస్తావన తప్పనిసరి. వధువు తండ్రి.. వరుడికి ఇచ్చే కానుక.. ఎంత ఎక్కువ ఇస్తే.. అంత ఘనంగా పెళ్లి జరుగుతోందని భావిస్తుంటారు. కానీ గల్ఫ్ దేశాల్లో వధువుకు ఈ కట్నాన్ని సమర్పిస్తుంటారు. వరుడే కట్నాన్ని వధువుకు ఇస్తుంటాడు. ఇప్పుడు ఈ కట్నం మాటలెందుకనుకుంటున్నారా..? ఒమన్‌లో ఓ 60 ఏళ్ల వ్యక్తి చేసిన ఓ పని.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. 

 
ఒమన్‌లోని మస్కట్‌లో సౌద్ అల్ ఫర్సీ అనే 60 ఏళ్ల వ్యక్తి.. తన కుమార్తెకు పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లి సంబంధాలు కూడా అన్నీ కుదిరాయి. కట్నం మాత్రం కావాలని పట్టుబట్టాడు. అదెంత మొత్తమో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. 20 ఒమనీ రియాల్స్ (52 డాలర్లు... అంటే సుమారు 3500 రూపాయలు) కట్నం కావాలంటూ వరుడిని కోరాడు. అంత తక్కువ మొత్తంలో కట్నం అడిగేసరికి జోక్ చేస్తున్నాడనుకున్నారంతా. కానీ కచ్చితంగా చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. అసలు కారణం ఏంటని అడగ్గా.. తన కూతురికి ఇవ్వబోయే కట్నం కోసం వరుడు అప్పులు చేయనక్కర్లేదనీ, తనకు అల్లుడిగా వస్తున్న అతడికి కొడుకుతో సమానంగా చూసుకుంటానని ఫర్సీ తేల్చిచెప్పాడు. సాధారణంగా అయితే ఒమన్‌లో మధ్యతరగతి వర్గాల వారు కనీసం 3000 ఒమనీ రియాల్స్‌.. ధనికులయితే 20 వేల రియాల్స్ వరకూ కట్నం ఇస్తుంటారు. అలాంటిది ఫర్సీ మాత్రం కట్నం అంత వద్దేవద్దంటున్నాడు. దీనికి తన కూతురు కూడా ఒప్పుకుందని చెబుతున్నాడు. 

 

Loading...