NRI-TRS-committee-announced-by-Mahesh-Bigala

టీఆర్ఎస్ కువైట్ కమిటీని ప్రకటించిన మహేశ్ బిగాల

కువైట్‌లోని టీఆర్ఎస్‌కు సంబంధించిన పూర్తి స్థాయి కమిటీని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ప్రకటించారు. కొన్ని నెలల క్రితమే అడహక్ కమిటీని ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. కువైట్‌లోని టీఆర్ఎస్ శాఖ చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను, మిషన్ కాల్ కాంపెయిన్ కార్యక్రమాన్ని అభినందించారు. టీఆర్ఎస్ ఎన్నారై సలహాదారు ఎంపీ కవిత సలహాల మేరకు గల్ఫ్‌లోని మిగతా దేశాలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని ప్రపంచవ్యాపంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మహేశ్ వివరించారు.

కాగా కువైట్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షులుగా మొహమ్మద్ అబ్దుల్ అసద్ అలీం ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్‌గా అభిలాష గొడిశాల, వైస్ ప్రెసిడెంట్స్ అబ్దుల్ అజిజ్, ప్రమోద్ కుమార్ మార్క, ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్, జాయింట్ సెక్రటరీ రవి గన్నరపు, రమేష్ ఓరగంటి, మైనారిటీ ఇంచార్జి ఎండీ సుభాన్ సోహెల్, షేక్ జమీల్, ఉమెన్ ఇంచార్జి దివ్య గారిణే, ఆర్గనైజింగ్ ఇంచార్జి రవి సుధగాని, గిరీష్ ఈసిగిరి, కల్చరల్ ఇంచార్జి జగదీష్ సాయి కుమార్ ఉప్పల, గోపాల్ నాసుపురి, మీడియా ఇంచార్జి రాజు మంచాల, యూత్ ఇంచార్జి రత్న కుమార్ మామిడాల, హరీష్ మోడెమ్, అడ్వైసరి కమిటీ జి కే గంగాదర్, కొండల్ రెడ్డి, అనిత గార్లపాటి.. తదితరులతో కూడిన కువైట్ టీఆర్ఎస్ శాఖను మహేశ్ బిగాల ప్రకటించారు.