nri-trs-cell-london-celebrations

లండన్‌లో ‘ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్-యుకే" వార్షికోత్సవం వేడుకలు

వార్షికోత్సవ వేడుకలతోపాటు కేసీఆర్ దిక్షాదీవాస్

లండన్: లండన్‌ నగరంలో "ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్-యుకే" ఏడవ వార్షికోత్సవ వేడుకలు, కేసీఆర్-దీక్షా దివస్‌ను ప్రవాస తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం లండన్‌లో ఏర్పాటు చేసిన 'కేసీఆర్ దీక్షా దివస్ వేడుకల' సందర్భంగా అభిప్రాయపడ్డారు.

 నవంబర్ 29, 2009న కేసీఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక ఘట్టంగా బావించి, ఆ రోజును దీక్ష దివస్‌గా జరుపుకుంటున్నామన్నారు.
సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం 'తెలంగాణ వచ్చుడో -కేసీఆర్ సచ్చుడో' అనే నినాదంతో తల పెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలకమని ఆయన పేర్కొన్నారు. 
 
ఉపాధ్యక్షులు అశోక్ దూసరి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి సకల జనులను ఏకం చేసి, శాంతి యుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్‌ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ ఎంచుకున్న అహింస పద్ధతిని, తెలంగాణ గాంధీజీ కేసీఆర్ పాటించి రాష్ట్ర సాధనోద్యమంలో ఎటువంటి హింసకు తావు లేకుండా, శాంతియుత పంథాతో ఏదైన సాధించవచ్చనే గొప్ప సందేశాన్ని, అటు భారతదేశ పౌరులకే కాకుండా, ప్రపంచానికే గొప్ప సందేశాన్నీ, మార్గాన్ని చూపిన గొప్ప స్పూర్తి దాత నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు.
 
అధికార ప్రతినిధులు సృజన్ రెడ్డి చాడ, రమేష్ యెసంపల్లి మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడే నేడు సేవకుడిగా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం తమ అదృష్టమని, బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిశలూ శ్రమిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలకు చేతనైతే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, లేకుంటే రాజకీయ విమర్శలకు ఎప్పటికప్పుడు జవాబు చెపుతామని, సరైన సందర్భంలో ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని అన్నారు. కేసీఆర్ దీక్ష తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు.
 
చివరిగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. లండన్ నుంచి కెసిఆర్ తలపెట్టిన దీక్ష నుంచి నేటివరకు వారికి మద్థతుగా ఉంటూ, చేపట్టిన కార్యక్రమాలని, ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడం తమ చారిత్రాత్మక అవసరమని, ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్‌కు ఎప్పటికప్పుడు కేసీఆర్ మరియు యావత్ టీఆర్‌ఎస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహకానికి కృతఙ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పునర్నిర్మాణంలో కూడా వారి వెంట ఉంటామని అన్నారు.
 
అనంతరం ఏర్పాటు చేసిన వార్షిక సమావేశంలో.. రాబోయే 2019 ఎన్నికల్లో ఒక నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, తెరాస ప్రభుత్వం చేప్పట్టిన అభివృద్ధిని, నియోజక వర్గాల ప్రజలకు అందించిన సేవలను సంక్షిప్తంగా ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించినట్టు తెలిపారు.   
 
మీటింగ్ అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం ఎన్నారై టీఆర్‌ఎస్ యుకే వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై  టీఆర్‌ఎస్ సెల్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డితోపాటు శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సెక్రటరీలు శ్రీధర్ రావు, సృజన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మల్లారెడ్డి బీరం, అధికార ప్రతినిధులు హరి గౌడ్ నవాబుపేట్, రమేష్ యెసంపల్లి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, ఐ.టీ సెక్రటరీ వినయ్ ఆకుల,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్, వెల్ఫేర్ ఇంచార్జ్ రాజేష్ వర్మ, ఈవెంట్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి, ఈస్ట్ లండన్ ఇంచార్జ్ నవీన్ మాదిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రవి కుమార్ రత్తినేని హాజరైన వారిలో ఉన్నారు