NRI-man-revealed-new-thing-about-detained-student

కొద్దిగంటల్లో విమానం ఎక్కుతాడనగా.. భారతీయ విద్యార్థిని అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు

వర్జీనియా: పే అండ్ స్టే వీసా కుంభకోణంలో ఇటీవల భారతీయ విద్యార్థులు అమెరికాలో అరెస్ట్ అయిన విషయం విధితదే. ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా యూనివర్శిటీలలో అడ్మిషన్ పొంది దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని కనిపెట్టడానికి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఫేక్ యూనివర్శిటీని ఏర్పాటు చేసి 130 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 129 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. భారత ప్రభుత్వం, అమెరికాలోని తెలుగు సంఘాలు అరెస్టయిన విద్యార్థులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

ఇదే సమయంలో అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో 20 ఏళ్లగా నివాసముంటున్న ఎన్నారై నాగిరెడ్డి ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియజేశారు. ఒక విద్యార్థి భారత్‌కు వెళ్దామనుకుని అన్నీ సర్దుకున్న రోజునే తాను ఫేక్ యూనివర్శిటీలో అడ్మిషన్ పొందినట్టు తెలుసుకున్నాడని నాగిరెడ్డి చెప్పారు. మరికొద్దిసేపట్లో విమానం ఎక్కుతాడనగా..అధికారులు విద్యార్థిని అరెస్ట్ చేశారన్నారు. చదువుకుంటున్న వాడనే కనికరం కూడా లేకుండా అధికారులు విద్యార్థి చేతికి సంకెళ్లు వేసి, కాళ్లను కట్టేసి దారుణంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని నాగిరెడ్డి ఆవేదన చెందుతూ చెప్పారు.