Nri-Hajj-travelers-must-give-passports

ఎన్‌ఆర్‌ఐ హజ్‌యాత్రికులు పాస్‌పోర్టులు సమర్పించాలి

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హజ్‌ కమిటీ నుంచి 2018 హజ్‌యాత్రకు ఎంపికైన ఎన్‌ఆర్‌ఐలు ఏప్రిల్‌ 30లోగా పాస్‌పోర్టులను సమర్పించాలని హజ్‌ కమిటీ చైర్మన్‌ మహ్మద్‌ మసియుల్లాఖాన్‌, కార్యనిర్వహణ అధికారి షుకూర్‌ తెలిపారు. గతంలో ఏప్రిల్‌ 15 చివరి తేదీ ప్రకటించగా నెలాఖరు వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు.