:: Welcome to NRI - Article ::

మిస్సైల్ టెస్టింగ్ ప్లేస్ మార్చేసిన ఉత్తరకొరియా

వాషింగ్టన్: ఉత్తరకొరియాను వరుస భూకంపాలు కంగారుపెడుతున్నాయని అంతర్జాతీయ మీడియా హెచ్చరిస్తోంది. అమెరికా హెచ్చరికలను, ఐక్యరాజ్యసమితి అంక్షలను కూడా కాదని ఉత్తరకొరియా మొండిగా న్యూక్లియర్ మిస్సైల్ పరీక్షలు నిర్వహిస్తున్నందువల్లే ఈ పరిస్థితులు వచ్చాయని ఆరోపించింది. అయితే దక్షిణకొరియా, చైనా శాస్త్రవేత్తలు మాత్రం ఉత్తరకొరియాలో సంభవిస్తున్న భూకంపాలకు న్యూక్లియర్ మిస్సైల్ పరీక్షలు కారణం కాదని తేల్చాయి. అయితే ఉత్తరకొరియా కూడా ఈ విషయంపై దృష్టి సారించిందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఉత్తరకొరియా న్యూక్లియర్ మిస్సైల్ పరీక్షలను ఎక్కువగా పుయోంగి రేలో నిర్వహిస్తోందని తెలిపింది.

భూకంపాల భయం వల్ల ఆ ప్రదేశంలో న్యూక్లియర్ మిస్సైల్ పరీక్షలు జరపకూడదని ఉత్తరకొరియా నిర్ణయం తీసుకుందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. న్యూక్లియర్ మిస్సైల్ పరీక్షలు జరుగుతున్న ప్రాంతానికి దగ్గరలోనే అగ్నిపర్వతం కూడా ఉందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని చైనా సరిహద్దుల్లో న్యూక్లియర్ మిస్సైల్ పరీక్షలు జరపాలని ఉత్తరకొరియా నిర్ణయించిందని అంతర్జాతీయ మీడియా తెలిపింది.