:: Welcome to NRI - Article ::

యుద్ధాన్ని రాజేస్తున్న డొనాల్డ్ ట్రంప్?

వాషింగ్టన్/ప్యాంగ్‌యాంగ్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉత్తరకొరియా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాకు ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని రాజేస్తున్నారని ఉత్తరకొరియా విదేశాంగశాఖా మంత్రి రి యోంగ్-హో మండిపడ్డారు. యుద్ధాన్ని రాజేస్తే ఉత్తరకొరియానే విజయం సాధిస్తుందని, మాటల యుద్ధం గెలవాల్సిన అవసరం లేదని ఆయన ధీమావ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి, ఇతర వేదికలపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై రియాంగ్‌హో మండిపడ్డారు. జగడాలమారి, యుద్ధసంకేత వ్యాఖ్యలు చేస్తున్నారని, పర్యవసానాలు ఎదుర్కొవలసిన వస్తుందని ట్రంప్‌ను హెచ్చరించారు. ఈ విషయాన్ని రష్యాకు చెందిన వెబ్‌సైట్ టీఏఎస్‌ఎస్ పేర్కొంది. ఈ వ్యాఖ్యలు చేసిన రియాంగ్‌హో.. ఉత్తరకొరియాపై అమెరికా యుద్ధం ప్రకటించిందని గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులు ఇలావుంటే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తకర వాతావరణం కొనసాగుతోంది. కొరియా గగనతలంపై అమెరికా యుద్ధవిమానాలు చక్కెర్లు కొట్టడంపై ఉత్తరకొరియా స్పందించాల్సి ఉంది.