no-business-with-those-companies-

సిరియాలో జరిగిన రసాయన దాడి నేపథ్యంలో..

వాషింగ్టన్: రసాయన ఆయుధాలు తయారుచేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఐక్యరాజ్యసమితి అమెరికా రాయబారి నిక్కిహేలీ అభిప్రాయపడ్డారు. ఇటీవల సిరియాలో జరిగిన రసాయన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దాడులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే సిరియాపై చర్యలు తీసుకోవాల్సిందేనని నిక్కిహేలీ స్పష్టం చేశారు. అంతేకాదు సిరియాలో జరిగిన రసాయన దాడికి రష్యా పరోక్షంగా సాయం చేసిందని హేలీ అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా హేలీ సిరియాపై ఆర్థిక అంక్షలు విధిస్తూ ప్రకటన చేశారు.

భవిష్యత్తులో సిరియా సంస్థలతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించరాదంటూ అమెరికా ట్రెజరీ కార్యదర్శి మ్యూనిచ్ ప్రకటించారు. సిరియాతోపాటు అనుమానిత రష్యా సంస్థలకు కూడా అంక్షలు వర్తిస్తాయని మ్యూనిచ్ తెలిపారు. రసాయన ఆయుధాలు మానవాళి వినాశనికి కారణమవుతాయని అందుకే వాటిని కట్టడి చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని హేలీ స్పష్టం చేశారు.