:: Welcome to NRI - Article ::

కన్న కొడుకు అర్ధరాత్రి చేసిన దారుణమిది

న్యూయార్క్: అర్ధరాత్రి 2:15 గంటలకు ఇంటికి వచ్చిన ఓ యువకుడు.. ఇంటి తలుపులు మూసివుండడంతో ఓ సుత్తిని తీసుకొని తలుపులు పగలకొట్టాడు. ఇంటిలోపల ఉన్న తన అమ్మ, చెల్లి, మరో మహిళను సుత్తితో దారుణంగా కొట్టించపాడు. దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాబీ వండర్‌హాల్ అనే 34 ఏళ్ల యువకుడు తన ఇంట్లోని వ్యక్తులతో ఆవేశపూరితంగా వ్యవహరిస్తూ వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారాడు. కొడుకు నుంచి తమ ప్రాణాలను రక్షించాలని బాబీ తల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పోలీసులు చర్య తీసుకోకముందే కొడుకుని ఇంటి నుంచి బయటకు గెంటివేసింది బాధిత తల్లి. కొద్దిరోజులపాటు కనిపించకుండా ఎక్కడికో వెళ్లిన నిందితుడు శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. సుత్తితో తలుపు పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు.. కన్న తల్లి ఏ గదిలో ఉందో తెలుసుకుని మరీ దారుణంగా చంపాడు. అనంతరం పక్కనే ఉన్న చెల్లి, మరో మహిళను చంపాడు. ఇంట్లోనే ఉన్న మరో మహిళను చంపాలని ప్రయత్నించాడు. తీవ్రమైన గాయాలతో ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని జైలుకి తరలించారు. విచారణ అనంతరం శిక్ష విధించనున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. 

 

Loading...