Mysterious-'sea-creature

వింత ఆకారం.. అదెంటో చెప్పాలంటూ...

వాషింగ్టన్: సముద్రం తీరాన నడుచుకుంటూ వెళ్తున్న డునామ్‌డు(33) అనే వ్యక్తికి ఒక వింత ఆకారం కనిపించింది. అతడికి కొద్దిదూరంలోనే ఆ వింత ఆకారం కదులుతూ కనిపించింది. చూసేందుకు జీవిలా కనిపిస్తున్నా అది జీవి కాదని డు అభిప్రాయపడుతున్నాడు. చెట్టులా కొమ్మలు ఉన్నాయి. అయితే అదెంటో చెప్పాలంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. నెటిజన్లు కూడా ఆ వీడియోను విపరీతంగా షేర్ చేసుకున్నారు. అయినా ఒక్కరూ కూడా అదెంటో చెప్పలేకపోయారని డు చెబుతున్నాడు. సముద్రంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనమని కొంతమంది అభిప్రాయపడ్డారు.