:: Welcome to NRI - Article ::

‘ఉత్తరకొరియాతో వారికి ఏ సంబంధం లేదు’

యాంగూన్/వాషింగ్టన్: అమెరికా అంతుచూస్తా, బూడిదకుప్పగా మారుస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న ఉత్తరకొరియా, దేశాధ్యక్షుడు కిమ్‌ను ఒంటరి చేసేందుకు అమెరికా తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రయత్నాల్లో భాగంగా మయన్మార్‌‌లో పర్యటించిన అమెరికా దౌత్యప్రతినిధి జోసెఫ్ యెన్ కీలకమైన ఓ ప్రకటన చేశారు. ఉత్తరకొరియా, మయన్మార్‌ మధ్య మిలిటరీ ఒప్పందాలు ఏమీ లేవని మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూకీ స్పష్టం చేశారని జోసేఫ్ తెలిపారు. ఉత్తరకొరియాను ఒంటరి చేసేందుకు తాము సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. న్యూక్లియర్ దాడులు, క్షిపణి దాడుల వల్ల ప్రమాదాలు, కొరియన్ ద్వీపకల్ప ప్రాంతంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై సింగపూర్‌లో జరిగిన సెమినార్‌కు జోసేఫ్ హాజరయ్యారు. పర్యటనలో భాగంగా మయన్మార్ స్టేట్ కౌన్సిలర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఉత్తరకొరియాతో తమకెలాంటి మిలిటరీ ఒప్పందాలు లేవని సూకీ పేర్కొన్నారని మయన్మార్‌లోని అమెరికా ఎంబసీ అధికారులు సోమవారం ఓ ప్రటకన విడుదల చేశారు.

 

Loading...