mother-who-is-carrying-her-dead-baby-

చనిపోయిన పిల్ల చేపను మోసుకుంటూ..

వాషింగ్టన్: తల్లి ప్రేమ ఏ జీవులకైనా ఒక్కటే. చనిపోయిన తన బిడ్డను మోసుకుంటూ వెళ్తున్న ఓర్కా(చేప) ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇన్‌ఫెక్షన్ బారిన పడి పిల్ల చేప చనిపోయింది. అయితే చనిపోయిన తన బిడ్డను అలాగే వదిలేయకుండా తల్లి చేప తన శరీరంపై ఆ పిల్ల చేప మృతదేహన్ని మోసుకుంటూ వెళ్లింది. నేహ బే వద్ద ఈ దృశ్యం కనిపించిందని నిపుణుల బృందం చెబుతున్నారు. వారు పిల్ల చేపను పట్టుకుని రక్షించే ప్రయత్నం చేశారు.

అయితే అప్పటికే పిల్ల చేప చనిపోయిందన్నారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా పిల్ల చేప శరీరం చాలా వరకు చెడిపోయిందని అందువల్లే అది చనిపోయిందని వారు తెలిపారు. ఓర్కా చేపల సంఖ్య భారీ స్థాయిలో తగ్గిపోయిందన్నారు. సముద్రంలో పెరుగుతున్న కాలుష్యం వల్ల ఇటువంటి అరుదైన చేపలు ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడి చనిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.