mother-shocks-with-boy-behaviour

8 ఏళ్ల బాలుడి ప్రవర్తనలో వచ్చిన మార్పుతో నిర్గాంతపోయిన తల్లి

దుబాయ్: ఎనిమిదేళ్ల వయసున్న ఓ బాలుడికి సంరక్షకురాలిగా పనిచేసిన 22 సంవత్సరాల యువతి అత్యంత హీనమైన చర్యకు పాల్పడింది. బాలుడికి సరిగా మాటలు రాక వైకల్యంతో బాధపడుతున్నాడు. ఈ పరిస్థితిని అనుకూలంగా భావించిన యువతి బాలుడిని లైంగికంగా వేధించింది. అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించింది. బాలుడి ముందు దుస్తులు విప్పడం, అసభ్యకరంగా బాలుడి చేతులు తనపై వేయించుకోవడం చేసింది. దాదాపు 3 నెలలపాటు ఇదే నిర్వాకాన్ని కొనసాగించింది. ఈ సమయంలో బాలుడి తల్లి వేరే దేశంలో ఉంది. తిరిగి ఇంటికి చేరుకోవడంతో తల్లి.. బాలుడి సంరక్షకురాలి ప్రవర్తన నచ్చక ఏజెన్సీకి అప్పగించింది. 

కానీ సంరక్షకురాలు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత బాలుడి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. బాలుడు తన తల్లిపై అసభ్యకరంగా చేతులు వేయడం, అసభ్యకరంగా తాకడం మొదలుపెట్టాడు. బాలుడి ప్రవర్తనలో వచ్చిన ఈ తేడాతో నిర్గాంతపోయిన తల్లి వివరాలను ఆరా తీయగా బాలుడి సంరక్షకురాలి నిర్వాకం బయటపడింది. బాలుడితో నిందిత మహిళ అసభ్యకరంగా ప్రవర్తించడం తాను రెండుసార్లు చూశానని ఇంట్లోని పనిమనిషి చెప్పింది. ఇంట్లో వారికి విషయం చెప్పవద్దంటూ తనను హెచ్చరించిందని తెలిపింది. దీంతో నిందితురాలిపై బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై దుబాయ్ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. తదుపరి విచారణ జూలై 25కు వాయిదాపడిందని పోలీసులు తెలిపారు. బాలుడి మానసిక స్థితి మెరుగుపడేందుకు అతడిని మానసిక వైద్యుడికి చూపించనున్నామని బాలుడి తల్లి తెలిపింది.