More-savings-for-UAE-residents-and-tourists

దుబాయ్ వెళ్తున్నారా.. ఈ విషయం తెలుసా..?

దుబాయ్: పర్యాటకుల స్వర్గధామం దుబాయ్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి పర్యాటకులు దుబాయ్ వెళ్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో దుబాయ్ వెళ్లే పర్యాటకుల సంఖ్య తగ్గుతూ వస్తుందని అధికారులు గుర్తించారు. అందుకు కారణంగా భారీ స్థాయిలో పెరిగిన హోటల్, ఇతర అకామిడేషన్‌ల అద్దెలేనని అధికారులు తెలిపారు. డిసెంబర్ మాసంలో చాలా దేశాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. అందువల్ల వెచ్చగా ఉండే దుబాయ్ సందర్శనకు అదే అనువైన సమయమని పర్యాటకులు భావిస్తుంటారు. ఆ నెలలోనే ఎక్కువమంది పర్యాటకులు దుబాయ్ బాట పడతారు. పెరిగిపోతున్న రూమ్‌ అద్దెల కారణంగా సాధారణ పర్యాటకులు దుబాయ్ వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని అధికారులు తెలిపారు. ధనవంతులే వస్తున్నట్లు గుర్తించామన్నారు. అందరూ దుబాయ్ సందర్శనకు వచ్చేవిధంగా హోటల్, ఇతర అకామిడేషన్‌ల అద్దెలను తగ్గించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా అమలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ప్రఖ్యాత బూర్జ్ అల్ అరబ్ హోటల్ ఎమిరెట్స్ బోర్డింగ్ పాస్ ఉన్న వారికి 50 శాతం రాయితీ ప్రకటించింది.