mom-carried-dying-baby-later-donated-her-organs

అమెరికాలో ఓ తల్లి సాహసోపేత నిర్ణయం తీసుకుని..

వాషింగ్టన్: క్రిస్టా డేవిస్(23) అనే మహిళ గర్భం దాల్చి 18 వారాలు(126రోజులు) గడిచాయి. డాక్టర్లు వివిధ రకాల పరీక్షలు చేశారు. పుట్టబోయే బిడ్డ ఎనాన్సిఫెలి(తల లేని పుట్టుక) వ్యాధితో పుట్టబోతున్నాడని క్రిస్టాకు చెప్పారు. పుట్టగానే 30 నిమిషాల కన్నా ఎక్కువ సమయం బతకదని తేల్చారు. క్రిస్టాను గర్భం తొలగించుకోవాలన్నారు. లేదా బిడ్డ పుట్టిన తర్వాత అవయవాలను దానం చేయమని సూచించారు. క్రిస్టా తన ప్రియుడు డ్రెక్ లావేట్‌కు విషయం చెప్పింది. ఇద్దరు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. బిడ్డ పుట్టి మరణించగానే అవయవాలను దానం చేయాలనుకున్నారు.  40 వారాల తర్వాత క్రిస్టమస్ రోజు బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకు రైలీ అని పేరు పెట్టారు. 30 నిమిషాల్లో చనిపోతుందన్న బిడ్డ వారం రోజులు బతికింది. క్రిస్టాకు ఎంతో సంతోషం కలిగించింది. అయితే పుట్టినప్పటి నుంచి రైలీ ఒక్కసారి కూడా ఏడవాలేదని క్రిస్టా చెప్పింది. చనిపోబోయే ముందు రోజు ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉండటంతో రైలీ కొంచెం మూలిగి చనిపోయిందని ఆమె తెలిపింది. చనిపోయిన రైలీ గుండె వాల్వూలను గుండె జబ్బుతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు అమర్చారు. ఊపిరితిత్తులను రిసెర్చ్ కోసం ఆసుపత్రిలోని లాబోరేటరీలో ఉంచారు. ప్రముఖ పత్రికకు క్రిస్టా ఇంటర్వ్యూ ఇచ్చింది. తన బిడ్డ చనిపోలేదని ఇద్దరినీ కాపాడిందని చెబుతోంది. అలాంటి బిడ్డ పుడుతుందని తాను అస్సలు ఊహించలేకపోయాయని క్రిస్టా చెప్పింది. అయినా 30 నిమిషాల్లో చనిపోతుందన్న బిడ్డ వారం రోజులు తనను సంతోషపెట్టేందుకే బతికిందని క్రిస్టా తెలిపింది.