modi-got-world-no-3-position-in-a-survey

డొనాల్డ్‌ ట్రంప్‌, పుతిన్‌, జిన్‌పింగ్‌‌లను దాటేసిన మోదీ

వరల్డ్‌ నెం.3.. మోదీ..

1, 2 స్థానాల్లో మెర్కెల్‌, మేక్రాన్‌: గాలప్‌ సర్వే 

న్యూఢిల్లీ, జనవరి 12: డొనాల్డ్‌ ట్రంప్‌, పుతిన్‌, జిన్‌పింగ్‌.. ఇలా ఎందరో హేమాహేమీల్ని దాటేసి ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా నిలిచారు. గాలప్‌ ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌, సి-వోటర్‌ కలిసి 55 దేశాల్లో నిర్వహించిన సర్వేలో.. మోదీ మూడో స్థానంలో నిలిచి సత్తా చాటారు. మొత్తం 53,769 మందిని నేరుగా, ఫోన్‌ ద్వారా, ఆన్‌లైన్‌లో ప్రశ్నించారు. 2017 అక్టోబరు నుంచి డిసెంబరు దాకా జరిగిన ఈ సర్వేలో అత్యధికుల ఆదరణ పొందిన జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ అగ్రస్థానంలో నిలవగా.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ రెండోస్థానాన్ని దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 10వ స్థానంలో నిలిచారు. 2015లో మోదీపై భారతీయుల అభిమానం స్కోరు 61 కాగా.. ఈసారి అది 71కి పెరిగింది.