missile-launched-on-saudi-arabia

సంచలనం..సౌదీఅరేబియాపై క్షిపణిదాడి

రియాద్, 9-8-2018: హౌతీ తిరుగుబాటుదారులు సౌదీఅరేబియాపై మరోసారి క్షిపణి దాడికి తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సౌదీఅరేబియా భద్రతా దళాలు క్షిపణిని గాల్లోనే పేల్చివేశాయి. దీంతో క్షిపణి శకలాలు పడిన జిజన్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ యెమెన్ పౌరుడు మృతిచెందాడు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతంలోనూ అనేక పర్యాయాలు హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై మిసైల్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను చాలా వరకు సౌదీఅరేబియా సమర్థంగా తిప్పికొట్టగలిగిన విషయం తెలిసిందే.