mid-air-collision-between-two-planes-averted

తృటిలో తప్పిన పెనుప్రమాదం

న్యూఢిల్లీ: దాదాపు 330 మంది ప్రయాణికులు అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడ్డారు. బెంగుళూరు నగర ఉపరితలంపై ఇండిగోకు చెందిన రెండు విమానాలు ఢీకొట్టుకునే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాయి. కేవలం 200 అడుగుల ఎత్తులో విమానాలు ఒకదానిపై మరొకటి ప్రయాణించాయి. అదృష్టం కొద్ది ఢీకొనలేదు. దీంతో పెనుప్రమాదం తప్పింది. బెంగుళూరు నగర ఉపరితలంపై ఈ ఘటన జరిగింది. కోయంబత్తూరు-హైదరాబాద్, బెంగుళూరు-కొచ్చిన్ రూట్లలలో ప్రయాణిస్తున్న ఈ రెండు ఇండిగో విమానాలు ఒకదానికొకటి సమీపం నుంచి ప్రయాణించిన వార్తను ఇండిగో విమానయాన సంస్థ ప్రతినిధి నిర్ధారించారు. ట్రాఫిక్ కొల్లిజిన్ అవైడెన్స్ సిస్టం అలారం ఆగిపోవడంతో ఈ పరిస్థితికి కారణమైందని ఆయన వివరించారు. నిబంధనల ప్రకారం ఘటనకు గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించామన్నారు. హైదరాబాద్ ప్రయాణించాల్సిన విమానంలో 162 మంది ప్రయాణికులు ఉండగా మరో విమానంలో 166 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు. ఈ ఘటన జూలై 10న జరిగిందని తెలిపారు.