massive-accident-

అతివేగం.. అజాగ్రత్తగా డ్రైవ్ చేయడం వల్లే..

వాషింగ్టన్: యాక్సిడెంట్ ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. డ్రైవర్ల అజాగ్రత్త వల్లనే పెద్ద సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన ఓ యాక్సిడెంట్ తీరు గమనిస్తే ఇది నిజమేనని స్పష్టమవుతోందన్నారు. ఓ కారు స్పీడుగా వెళ్తోంది. దాని ముందు వెళ్తున్న వాహనాలు కూడా స్పీడుగానే వెళ్తున్నాయి. అయితే రోడ్డుపై మూలమలుపు ఉందన్న విషయం గమనించకుండా కారు డ్రైవర్ దూసుకెళ్లాడు. ముందు వెళ్తున్న వాహనాల డ్రైవర్లు మాత్రం మూలమలుపు ఉందని గమనించి తమ వాహనాలను నెమ్మదిగా నడిపారు.

కారు డ్రైవర్ మాత్రం అదే వేగంతో మూలమలుపు వద్ద కూడా కారును తిప్పకుండా అలాగే పోనిచ్చాడు. దాంతో కారు డివైడర్‌ను ఢీకొట్టి చాలా ఎత్తులో ఎగిరిపడింది. అతి వేగం, అజాగ్రత్తగా కారు నడపటం వల్లే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ పెద్దగా గాయాలు కాలేదని వారు అన్నారు.