MASSIVE-ACCIDENT-

ఘోర ప్రమాదం.. యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే..

వాషింగ్టన్: ఏ క్షణానికి ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్డెక్కిన మనిషి ఇంటికి చేరుకునే దాకా నమ్మకం లేకుండపోతోంది. రోజుకి రోజుకి యాక్సిడెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. రోడ్డు నియమాలు పాటించకుండా చాలా మంది ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఈ మధ్య అమెరికాలో జరిగిన ఓ యాక్సిడెంట్ వీడియో వైరల్‌గా మారింది. సెర్ఫిడిజీ(57) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కారులో బయలుదేరాడు. వారి కారు రోడ్డెక్కిన కొద్దిసేపటికే విధి వారిని చిన్నచూపు చూసింది.

డిజీ కారు రైట్ టర్న్ తీసుకుంటుండగా మరో కారు వేగంగా దూసుకొచ్చి డిజీ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న డిజీ భార్య ఎడ్జి డిజీ(48) కుమార్తె అమ్రా డిజీ(20)లు అక్కడిక్కడే చనిపోయారు. డిజీ కుమారుడు అమెల్(16) మాత్రం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన కొద్దిసేపటికే పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకుండాపోయింది.   

వీడియో సౌజన్యం ప్రైమ్ న్యూస్ స్టూడియో